కమల్‌హాసన్‌కు స్వల్ప అస్వస్థత
అగ్ర నటుడు కమల్‌హాసన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, దగ్గుతో బాధపడుతున్న ఆయన్ని బుధవారం రాత్రి చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
అగ్ర నటుడు కమల్‌హాసన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, దగ్గుతో బాధపడుతున్న ఆయన్ని బుధవారం రాత్రి చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కమల్‌హాసన్ ఆరోగ్య పరిస్థితిపై గురువారం సాయంత్రం ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. కమల్‌హాసన్‌కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బం ది తలెత్తిందని, వెంటనే చికి త్స మొదలుపెట్టామని, ప్రస్తు తం ఆరోగ్యం నిలకడగా ఉం దని డాక్టర్లు తెలిపారు. ఆరోగ్యం పూర్తిగా మెరుగయ్యాక ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం కమల్‌హాసన్ ‘ఇండియన్-2’ షూటింగ్‌తో పాటు తమిళ ‘బిగ్‌బాస్’ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. ఈ కారణంగానే అస్వస్థతకు గురయ్యారని అంటున్నారు. బుధవారం హైదరాబాద్‌కు విచ్చేసిన కమల్‌హాసన్ తన గురువు కళాతపస్వి కె.విశ్వనాథ్‌ను కలిసిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

