Antony Movie | అఖిల్ హలో (Hello) సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది పాపులర్ డైరెక్టర్ ప్రియదర్శన్ కూతురు కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan). ఆ తర్వాత తెలుగులో చిత్రలహరి (Chitralahari), రణరంగం (Ranarangam) సినిమాలతో పాటు మలయాళంలో బ్రో డాడీ (Bro Daddy), తల్లుమల్ల (Thallumalla), హృదయం (Hrudayam) చిత్రాలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ భామ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఆంటోని'(Antony). జోజు జార్జ్ (Joju George)ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బీజీగా ఉన్న ఈ సినిమా డిసెంబర్ 01న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
కళ్యాణి ప్రియదర్శన్ ఈ సినిమాలో బాక్సింగ్ ప్లేయర్గా కనిపించబోతుండగా.. జోజు జార్జ్ విలేజ్ డాన్ నటించనున్నట్లు తెలస్తుంది. ఇక పూర్తి స్థాయి యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రానున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమయిపోతుంది. ఐన్స్టీన్ మీడియా, నెక్స్టెల్ స్టూడియోస్, అల్ట్రా మీడియా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. జోషి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది.
జోజు జార్జ్, కళ్యాణి ప్రియదర్శన్, సెంబన్ వినోద్ జోస్, నైలా ఉష వంటి ప్రధాన తారాగణంతో పాటు విజయరాఘవన్, ఆశా శరత్, జిను జోసెఫ్, హరి ప్రశాంత్, అప్పాని శరత్, బిను పప్పు, సుధీర్ రమణ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.