ఖాన్ దురాని, సాహితి ఆవంచ జంటగా నటిస్తున్న చిత్రం ‘కల్యాణం కమనీయం జీవితం’. రవి లోకిరెడ్డి దర్శకత్వంలో పైలా ప్రసాద్‌రావు, కిషోర్ గుండాల నిర్మిస్తున్నారు. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి అగ్ర దర్శకుడు వి.వి.వినాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
యువతతో పాటు ఫ్యామిలీస్ అందరూ మెచ్చేలా చక్కటి హాస్యం, భావోద్వేగాల కలబోతగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని దర్శకుడు తెలిపారు. ఈ కథలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని, కొత్తవాళ్లను ప్రోత్సహిస్తూ ఇన్నోవేటివ్ కంటెంట్‌తో సినిమాలు తీయాలనే లక్ష్యంతో తమ సంస్థను స్థాపించామని నిర్మాతలు పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల చెప్పారు. ప్రేమికుల కోణంలో గొప్ప పాయింట్‌ను చర్చించిన ఈ సినిమా అందరికి నచ్చుతుందని హీరో ఖాన్ దురాని అన్నారు.