నందమూరి కల్యాణ్‌రామ్ 21వ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను ఎన్టీయార్ జయంతి సందర్భంగా మేకర్స్ విడుదల చేశారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బసులు నిర్మాతలు. మంగళవారం విడుదల చేసిన గ్లింప్స్‌లో కల్యాణ్‌రామ్ చేతిని మాత్రమే మేకర్స్ రివీల్ చేశారు.
చేతికి రుద్రాక్షమాల.. చేతినిండా రక్తం.. బిగించి వున్న కల్యాణ్‌రామ్ పిడికిలి.. వీటిని ఈ గ్లింప్స్‌లో చూడొచ్చు. ‘ది ఫిస్ట్ ఆఫ్ ఫ్రేమ్’ కొటేషన్‌తో విడుదలైన ఈ గ్లింప్స్ ద్వారా కల్యాణ్‌రామ్ కేరక్టర్ ఇందులో ఎంత శక్తిమంతంగా ఉంటుందో దర్శకుడు చెప్పకనే చెప్పాడు. విజయశాంతి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం.
‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత ఆమె చేస్తున్న సినిమా ఇదే. ‘కర్తవ్యం’ తరహాలో పవర్ఫుల్ డైనమిక్ పాత్రలో ఆమె కనిపించనున్నారని మేకర్స్ ప్రకటించారు. సోహైల్‌ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతున్నది. ఈ చిత్రానికి కెమెరా: రామ్‌ప్రసాద్, సంగీతం: అజనీష్ లోకనాథ్, స్క్రీన్‌ప్లే: శ్రీకాంత్ విస్సా. నిర్మాణం: అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్.