కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్‌లోకి వచ్చి బిగ్గెస్ట్ హిట్ కొట్టిన చిత్రం అఖండ. బాలకృష్ణ, బోయపాటి శీను కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. సింహ లెజెండ్ తర్వాత వచ్చిన ఈ సినిమా విడుదలకు ముందే భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేసింది. ఇక బాక్సాఫీసు వద్ద మొదటిరోజు ఈ సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చాయి.
సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా జై బాలయ్య అంటూ థియేటర్స్ లో నినాదాలు చేస్తున్నారు. ఓవర్సీస్ లో కూడా అదే రీ సౌండ్ వినిపిస్తోంది అంటే సినిమా స్థాయిలో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొత్తానికి అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంది. ఇక ఈ సినిమాని మొదటి రోజు జూనియర్ ఎన్టీఆర్ కూడా చూసేసాడు.
సినిమా చూశాను అంటూ బాలా బాబాయ్ కు అలాగే చిత్ర యూనిట్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇక ఈ సినిమాలో అయితే హార్డ్ కోర్ ఫ్యాన్ మూమెంట్స్ చాలా ఉన్నాయి అంటూ తనదైన శైలిలో వివరణ ఇచ్చాడు. తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ సైతం బాలయ్యను ఆకాశానికెత్తేస్తూ ట్వీట్ చేశాడు. “బాలయ్య బాలయ్య…ఇరగతీసావయ్యా.. అఖండను పూర్తిగా ఆస్వాదించాను.. బాబాయ్ ఫుల్ ఫోర్స్ లో ఉన్నారు. ఇండస్ట్రీని పునరుజ్జీవింపజేసే బ్లాక్‌బస్టర్‌ను సాధించినందుకు మొత్తం టీమ్‌కు అభినందనలు” అంటూ ట్వీట్ చేశాడు.
బాలయ్య బాలయ్య…ఇరగతీసావయ్యా…
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) December 3, 2021
Enjoyed #Akhanda thoroughly.
Babai in full force. Congratulations to the entire team for scoring a industry reviving blockbuster.