Kalyan Ram | ఫలితంతో సంబంధంలేకుండా కెరీర్ బిగెనింగ్ నుండి కథా బలమున్న సినిమాలు చేస్తూ టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నందమూరి కళ్యాణ్‌రామ్. ఇటీవలే ‘బింబిసార’తో భారీ విజయం సాధించిన కళ్యాణ్‌రామ్, ప్రస్తుతం అదే జోష్‌తో తన తదుపరి సినిమాలను చేస్తున్నాడు. కళ్యాణ్ రామ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. అందులో ‘డెవిల్’ ఒకటి. ‘బాబు బాగా బిజీ’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన నవీన్ మేడారం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తమిళనాడులోని కరైకుడిలో జరగుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
పీరియాడిక్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 1945 టైమ్‌లో జరుగునుంది. బ్రిటీష్ వాళ్లు పాలిస్తున్న సమయంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్ రహస్య గూఢాచారిగా కనిపించనున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్లు ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలు నెలకొల్పాయి. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. కళ్యాణ్‌రామ్‌కు జోడీగా సంయుక్త మీనన్ నటించనుంది.
పటాస్ తర్వాత దాదాపు ఏడేళ్ళకు కళ్యాణ్‌రామ్ బింబిసారతో హిట్టు సాధించాడు. ఆగస్టు 5న రిలీజైన ఈ చిత్రం కళ్యాణ్‌రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అంతేకాకుండా ఆయన మార్కెట్ కూడా విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలోనే డెవిల్ మూవీకి షూటింగ్ దశలో ఉండగానే భారీ స్థాయిలో ఆఫర్స్ వస్తున్నాయట. బింబిసారా మేజిక్‌ను ఈ సినిమాతో రిపీట్ చేస్తాడని పలువురు నందమూరి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈయన ‘అమిగోస్’ అనే యాక్షన్ సినిమా చేస్తున్నాడు. మైత్రీ సంస్థ నిర్మిస్తున్న ఈచిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.