కల్యాణ్‌దేవ్ కథానాయకుడిగా ఎంపి ఆర్ట్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఎం.కుమారస్వామినాయుడు దర్శకుడు. మోనిష్ పత్తిపాటి నిర్మాత. గురువారం హైదరాబాద్‌లో చిత్ర పూజా కార్యక్రమాల్ని నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమిది. కల్యాణ్‌దేవ్ పాత్రచిత్రణ కొత్తగా ఉంటుంది. అక్టోబర్ చివరి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాణ నిర్వహణ: గౌతి హరినాథ్, ఛాయాగ్రహణం: వైఎస్కృష్ణ.