Kalpana| ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్య ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశం అయింది. నిద్ర మాత్రలు మింగి ఆమె ఆత్మహత్యకి యత్నించినట్టు సమాచారం. సకాలంలో ఆసుపత్రికి తరలించడంతో వైద్యులు ఆమెకి మెరుగైన వైద్యం అందించారు. ప్రస్తుతం కల్పన కోలుకుంటున్నట్టు తెలుస్తుంది. ఆరోగ్యం కూడా నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే కల్పన ఆత్మహత్యకి కారణం కుటుంబ గొడవలే అని తెలుస్తోంది. పోలీసులు విచారణలో ఆమె భర్త, కుమార్తె గురించి వార్తలు వస్తున్నాయి. వీరిద్దరిలో కల్పనకి ఎవరితో సమస్య ఉందనేది తెలియాల్సి ఉంది.
ఇక కల్పనకి ఆత్మహత్య ఆలోచన మొదటి సారి కాదు. గతంలో కూడా ఆమె సూసైడ్‌కి ప్రయత్నించిది. చనిపోవాలని అనుకున్నాను అంటూ ఓ ఇంటర్వ్యూలో కూడా తెలియజేసింది. మలయాళంలో జరిగిన మ్యూజిక్ కాంపిటీషన్ లో కల్పన విజేతగా నిలిచినప్పుడు గాయనిగా అవకాశాలు వస్తున్నప్పుడు కంటెస్టెంట్ గా సింగింగ్ కాంపిటీషన్ లో ఎందుకు పాల్గొన్నారు అని యాంకర్ ప్రశ్నించింది. అప్పుడు కల్పన సమాధానం ఇస్తూ.. 2010లో ఆ సింగింగ్ కాంపిటీషన్ లో పాల్గొన్నాను. ఓపెన్ గా చెప్పాలంటే నా జీవితంలో ఆ సమయానికి అన్ని కోల్పోయాను. వైవాహిక జీవితం ముక్కలైంది. సంపాదన లేదు. పిల్లల్ని ఎలా చదివించాలో అర్ధం కాలేదు. ఆ సమయంలో చనిపోవాలని అనుకున్నాను.
అప్పుడు సింగర్ చిత్రమ్మ (చిత్ర) నా ఆలోచనని మార్చే ప్రయత్నం చేశారు అని కల్పన తెలియజేసింది. నువ్వు సూసైడ్ చేసుకోవడానికి పుట్టావా, అనుభవించిన కష్టాల నుండి బయటపడడానికి మలయాళంలో సింగింగ్ కాంపిటీషన్‌కి వెళ్లమని అన్నారు. అప్పుడు వెళ్లి విజేతగా నిలిచాను అని తెలిపింది కల్పన. అయితే ఆ షోలో పాల్గొనడం వల్ల కొందరు నా ముఖం మీద ఉమ్మేసినట్లు మాట్లాడారు. సింగర్ గా రాణిస్తూ సింగింగ్ కాంపిటీషన్ లో పాల్గొంది, ఎందుకంత కక్కుర్తి అన్నట్టు మాట్లాడారు. అయితే చిత్ర గారు తన లైఫ్ ని గైడ్ చేయడం,ఎస్పీ బాలు గారు నన్ను కెరీర్ పరంగా గైడ్ చేయడం వలన నా జీవితం తర్వాత సంతోషంగా మారిందని కల్పన ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది.