Singer Kalpana| సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం కేసుకి సంబంధించి నెట్టింట అనేక వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కల్పన భర్త పెట్టిన టార్చర్ వలన సూసైడ్ చేసుకుందని కొందరు అంటుంటే, లేదు లేదు కూతురితో జరిగిన మనస్పర్థల కారణంగా ఆత్మహత్యాయత్నంకి ప్రయత్నించిందని ఇంకొందరు అంటున్నారు. అయితే కొద్ది సేపటి క్రితం స్పృహలోకి వచ్చిన కల్పన దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు.తన కూతురితో జరిగిన మనస్పర్థల కారణంగా నిద్ర లేకపోవడంతో అధిక మోతాదులో నిద్రమాత్రలు తీసుకున్నాను. దాని వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు వివరణ ఇచ్చారు.
కల్పన విషయంలో ఎవరిది తప్పు లేదని కేపీహెచ్బీ పోలీసులు ప్రెస్ నోట్ విడుదల చేశారు. అయితే కల్పన కూతురు మాత్రం తాజాగా మీడియా ముందుకు వచ్చి తన వర్షెన్ వేరేలా చెప్పింది . కల్పన హాస్పిటల్ లో చేరిందని విషయం తెలుసుకున్న కూతురు వెంటనే కేరళ నుంచి బయలుదేరి హైదరాబద్కి వచ్చింది. ఇప్పటికే పోలీసులు ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టు తెలుస్తుంది. ఇక పోలీసులతో మాట్లాడిన అనంతరం కల్పన కూతురు మీడియాతో మాట్లాడుతూ…`నా తల్లి కల్పన సూసైడ్ చేసుకోలేదు. డాక్టర్ల సూచన మేరకు జోల్ ప్రెష్ మాత్రలు తీసుకుంది. అయితే మాత్రలు కాస్త ఎక్కువ మోతాదులో తీసుకోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిందని సింగర్ కల్పన కూతురు పేర్కొంది.
అందరు అనుకుంటున్నట్టు మా కుటుంబంలో ఎలాంటి వివాదాలు లేవు. ప్రస్తుతం అమ్మ హైదరాబాద్లో లా పీజీ చేస్తుండగా, దాని వలన మానసిక ఒత్తిడికి గురవుతుంది. దానివల్ల మా అమ్మకు ఇన్సోమియా (నిద్రలేమి) సమస్య వచ్చింది. ట్రీట్మెంట్ లో భాగంగా డాక్టర్ ఆమెకు కొన్ని మెడిసిన్స్ ఇవ్వగా, అవి ఓవర్ డోస్ తీసుకోవడం వలన అపస్మారక స్థితి లోకి వెళ్లి ఉంటుందని` తెలిపింది. ఇది ఆత్మహత్య కాదు. దయచేసి తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి. కొని రోజుల్లో మా అమ్మ పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వస్తారు అని తెలిపింది.అయితే కల్పన ఏమో తన కూతురి వల్లనే ఇలా టాబ్లెట్ తీసుకున్నా అని చెప్పగా, ఆమె కూతురు మాత్రం అదేమి లేదని అంటుంది. ఏది ఏమైన కల్పన త్వరగా కోలుకుంటే అదే పదివేలు అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.