Kalki 2898 AD | పాన్ ఇండియా నటుడు ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన తాజా బ్లాక్ బస్టర్ ‘కల్కి’ బాక్సాఫీస్ వద్ద తన జైత్రయాత్రను ఇంకా కొనసాగిస్తుంది. తాజాగా ఈ చిత్రం రూ.1000 కోట్ల క్లబ్లో ఎంటర్ అయినట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కేవలం 17 రోజుల్లోనే రూ.1000 కోట్ల మార్క్ టచ్ చేసినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రత్యేక పోస్ట్ పెట్టాడు.
ఈ మైలురాయి… ఈ నెంబర్ (₹1000 కోట్లు) అనేది నిజానికి మాలాంటి యువ టీమ్ కి చాలా అద్భుతమైన విజయం. కానీ, వాస్తవానికి ఇక్కడ ఎలాంటి రక్తపాతం కానీ, అశ్లీలత, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, దోపిడి, గాయపరిచే మాటలు కానీ ఈ సినిమాలో లేవు. అయిన కూడా ఈ ఇటువంటి మైలురాయిని సాధించడమంటే చిన్న విషయం కాదు. ఈ మూవీని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు, నటీనటులకు బిగ్ థ్యాంక్యూ. ఇది ఇండియన్ సినిమా. రేపటికోసం Repatikosam అంటూ రాసుకొచ్చారు. అయితే ఈ పోస్ట్‌పై ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చర్చలు జరుగుతున్నాయి. నాగ్ అశ్విన్ టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఉద్దేశించి ఇలాంటి పోస్ట్ పెట్టాడు అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
గతేడాది సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ చిత్రం బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. థియేట్రికల్ రన్లో ఈ మూవీ రూ.950 కి పైగా గ్రాస్ వసూళ్లు చేసింది. అయితే ఈ సినిమాలో మితిమిరిన వయిలెన్స్, రొమాన్స్, బోల్డ్ డైలాగ్స్ ఉండడంతో చాలా విమర్శలను ఎదుర్కొంది ఈ చిత్రం. కొందరు అయితే సినిమాను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ కూడా చేశారు. అయితే తాజాగా నాగ్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు సందీప్ గురించేనని ఎక్స్‌లో చర్చ అవుతుంది. ముఖ్యంగా రక్తపాతం కానీ, అశ్లీలత కానీ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేకుండా రూ.1000 కోట్ల సాధించాను అంటూ నాగ్ అశ్విన్ పెట్టడంతో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.
Vanga @imvangasandeep Genuine ga 930+ chesi kuda 1000Cr poster veskole.. He made Animal with 1/3rd of Kalki Budget..
Mythology Character ni misrepresent chesi Huge Star Cast petti, boased no.s eskuni endukura kathal esthunnav @nagashwin7
Very Soon niku Thirigichesthadu 🔥 pic.twitter.com/VFJQ16XkLm
— Ujjwal Reddy (@HumanTsunaME) July 14, 2024
Budget is 4x times of Animal and have casting like Amitabh, Kamal Hassan, Deepika Padukone, Dulquer Salman etc etc and comparing yourself with Vanga who made blockbuster with just music screenplay and Ranbir Kapoor 😏 @nagashwin7 enduku ayya comparison pic.twitter.com/GS5BlxhiB1
— Satyajith (@satyajithpinku) July 14, 2024
Common Knowledge. pic.twitter.com/VrKGfWpPgI
— RKᵃ (@seeuatthemovie) July 14, 2024