Kalki 2898 AD | పాన్ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. ఈ సినిమాకు మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా.. దీపిక, దిశా పటానీ హీరోయిన్లు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు సినిమా రానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన భైరవ (ప్రభాస్) బుజ్జి వీడియో అభిమానులకు బిగ్ సర్ప్రైజ్గా నిలిచింది. ప్రభాస్ పెట్టిన ఇన్‌స్టా స్టోరీ వల్ల ఈ ఎపిసోడ్‌కు మరింత హైప్ పెరిగింది. అందులో భాగంగా భైరవ (ప్రభాస్) బెస్ట్‌ఫ్రెండ్‌ను మేకర్స్ పరిచయం చేశారు. కీర్తి సురేశ్ వాయిస్ ఓవర్ ఇచ్చిన ఆ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది.
అయితే బుజ్జి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మే 22 వరకు వెయిట్ చేయాల్సిందేనని చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ను ఇచ్చారు మేకర్స్. బుజ్జి రివీల్‌కు సంబంధించిన ఈవెంట్‌ను నేడు రామోజీ ఫిల్మ్ సిటీలో జరుపనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని తెలుపుతూ.. రామోజీ ఫిల్మ్ సిటీలో నేడు మా బుజ్జి & భైరవని కలవండి! అంటూ రాసుకోచ్చారు. ఇక ఈ వేడుక నేడు సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభం కానుంది.
Meet our Bujji & Bhairava!
🗓️ May 22nd, 5 PM Onwards
📍Ramoji Film City, Hyderabad#Kalki2898AD #Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @BelikeBujji @saregamaglobal @saregamasouth… pic.twitter.com/Yn69wasWNr— Kalki 2898 AD (@Kalki2898AD) May 21, 2024