అగ్ర హీరో ప్రభాస్ నటించిన మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కల్కి 2898ఏడీ’ భారతీయ బాక్సాఫీస్ వద్ద అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. భారతీయ పురాణేతిహాసాల స్ఫూర్తితో అత్యాధునిక గ్రాఫిక్స్ హంగులతో రూపొందిన ఈ సినిమా దేశవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సీక్వెల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సీక్వెల్ తాలూకు 30 శాతం షూటింగ్ పూర్తయిందని మేకర్స్ గతంలోనే ప్రకటించారు. దీంతో సీక్వెల్ రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టేది ఎప్పుడోనని అభిమానులు చర్చించుకుంటున్నారు.
తాజా పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో చిత్ర దర్శకుడు నాగ్అశ్విన్ సీక్వెల్ షూటింగ్‌పై క్లారిటీ ఇచ్చాడు. ఈ సంవత్సరాతంలో షూటింగ్ మొదలుపెట్టి 2026 ద్వితీయార్థంలో చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశామని, అయితే ప్రస్తుత పరిస్థితులు, ఆర్టిస్టుల డేట్స్ అడ్జెస్ట్మెంట్ ఇష్యూస్ వల్ల సినిమా కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
నాగ్అశ్విన్ మాటలతో ‘కల్కి’ సీక్వెల్‌కు మరింత సమయం పట్టే అవకాశం ఉందని ట్రేడ్‌వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు ‘ది రాజా సాబ్’ ‘ఫౌజీ’ షూటింగ్‌లతో ప్రభాస్ బిజీగా ఉన్నారు. త్వరలో ‘స్పిరిట్’ పట్టాలెక్కనుంది. ఈ సినిమా పూర్తయ్యాకే ‘కల్కి-2’ సెట్స్‌మీదకు వస్తుందని అంచనా వేస్తున్నారు.