Kalki 2898 AD | ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘ప్రాజెక్ట్-కె’ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ‘వాట్ ఈజ్ ప్రాజెక్ట్-కె’ అంటూ చిత్ర బృందం చేపట్టిన ప్రచారం టైటిల్ ఏమిటో తెలుసుకోవాలనే ఉత్సుకతను పెంచింది. శాండియాగో కామిక్ కాన్ ఈవెంట్లో ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు. ఈ చిత్రానికి ‘కల్కి 2898 ఏడీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
ఈ సందర్భంగా చిత్ర ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. థ్రిల్లింగ్ యాక్షన్ ఎపిసోడ్స్, అబ్బురపరిచే విజువల్స్‌తో ఫస్ట్‌గ్లింప్స్ సరికొత్త అనుభూతిని పంచింది. ప్రతీ యుగంలో ధర్మ రక్షణ కోసం ఓ మహావీరుడు పుట్టుకొస్తాడు అనే సందేశాన్ని అందిస్తూ గ్లింప్స్ ఆకట్టుకుంది. దర్శకుడు నాగ్అశ్విన్ మాట్లాడుతూ ‘ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రమిది.
నేను సైన్స్ ఫిక్షన్, పురాణాలను బాగా ఇష్టపడతాను. మహాభారతం, స్టార్‌వార్స్ చూస్తూ పెరిగాను. ఈ రెండు ప్రపంచాలను కలిపే సినిమా చేయడం గర్వంగా ఉంది’ అన్నారు. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పడుకోన్, దిశాపటానీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ నిర్మిస్తున్నారు.