Kalki 2898 AD | గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కాంపౌండ్ నుంచి వస్తోన్న తాజా చిత్రం కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). మహానటి ఫేం నాగ్ అశ్విన్ (Nag ashwin) దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ జోనర్లో వస్తోన్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ తెరకెక్కిస్తోంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ప్రభాస్ అండ్ నాగ్ అశ్విన్ టీం ఏదో ఒక వార్తను షేర్ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తోంది.
ప్రమోషన్లో భాగంగా special prelude ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. కల్కి Kalki2898AD ప్రపంచం ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ ఎపిసోడ్ 1ను ఇవాళ సాయంత్రం లాంఛ్ చేయనున్నట్టు తెలియజేశారు మేకర్స్. ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇప్పటకే ఈ చిత్రం నుంచి లాంఛ్ చేసిన బుజ్జి, భైరవ విజువల్స్, ట్రైలర్ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ భైరవ (Bhairava) పాత్రలో కనిపించనుండగా.. అతడి దోస్త్ బుజ్జి (Bujji)గా స్పెషల్ కారు సందడి చేయనుంది.
కల్కి 2898 ఏడీలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన కల్కి 2898 ఏడీ టైటిల్, గ్లింప్స్ వీడియో, టీజర్ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.
A journey into the world of #Kalki2898AD ft. Director @nagashwin7…
Catch Episode 1 – Today at 4 PM!#Kalki2898ADonJune27 pic.twitter.com/K1NKQkTwTn
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) June 18, 2024