Kalidas Jayaram | మలయాళ స్టార్ నటుడు జయరాం ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. జయరాం కుమారుడు, యువ నటుడు కాళిదాస్ జయరాం (Kalidas Jayaram) త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. తన స్నేహితురాలు తరిణీ కళింగరాయర్తో కాళిదాస్ పెళ్లి ముహూర్తం ఖరారైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం వీరి ఎంగేజ్మెంట్ చెన్నైలో ఘనంగా జరిగింది. జయరాం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోలు చూసిన అందరూ కాళిదాస్, తరిణీ కళింగరాయర్లకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
పావ కదైగల్ (2020) హ్యాపీ సర్దార్ (2019) విక్రమ్ (2022) చిత్రాలతో కాళిదాస్ జయరాం మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ సినిమాలో ప్రభంజన్ పాత్రలో కాళిదాస్ అలరించారు. విక్రమ్ సినిమాలో కాళిదాస్ క్యారెక్టర్ ఉండేది కొద్దిసేపే అయిన తన నటనతో మంచి మార్కులు సంపాదించాడు. ఇక ప్రస్తుతం ‘ఇండియన్ 2’, ‘ధనుష్ 50’ చిత్రాల్లో కాళిదాస్ నటిస్తున్నారు. మారోవైపు తరణీ మోడల్‌గా రాణిస్తుంది. మిస్ యూనివర్స్ ఇండియా 2021 పోటీల్లో ఆమె మూడో రన్నరప్‌గా నిలిచింది.
Kalidas Jayaram Shared his Colourful Engagement moments🥳❣️#KalidasJayaram #TariniKalingarayar
📸-#MagicMotionMedia pic.twitter.com/IiTLLv9eBf
— Behindwoods (@behindwoods) November 11, 2023