Kalaavathi Song from Sarkaru Vaari Paata | సర్కారు వారి పాట సినిమా నుంచి విడుదలైన కళావతి సాంగ్ రికార్డుల పర్వం కంటిన్యూ అవుతుంది. తమన్ సంగీతం అందించిన ఈ పాట విడుదలైన క్షణం నుంచి యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మరీ ముఖ్యంగా మహేశ్ బాబు, కీర్తి సురేశ్ కెమిస్ట్రీ ఈ పాటకు అదనపు ఆకర్షణగా నిలిచింది. దానికి తోడు సిధ్ శ్రీరామ్ అద్భుతమైన వాయిస్ కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. ఈ మధ్య కాలంలో తమన్ ఏ సినిమాకు సంగీతం అందించిన కూడా అది సూపర్ హిట్ అవుతుంది. ఇప్పుడు సర్కారు వారి పాట సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది. విడుదలైన 24 గంటల్లోనే కళావతి సాంగ్ ఏకంగా 16 మిలియన్ న్యూస్ అందుకుంది.
అప్పటి వరకూ సౌత్ ఇండియాలో మరో సినిమాకు సాధ్యం కాని రికార్డుల్ని సృష్టించింది కళావతి పాట. అయితే కేవలం ఒక రోజు గ్యాప్‌లో విజయ్ బీస్ట్ సినిమాలోని అరబిక్ కుత్తు పాట వచ్చి కళావతి రికార్డ్ చెరిపేసింది. ఈ పాట మొదటి 24 గంటల్లో 20 మిలియన్ వ్యూస్ అందుకుంది. ఇదిలా ఉంటే తాజాగా కళావతి సాంగ్ మరో రికార్డు తిరగరాసింది. అత్యంత వేగంగా వన్ మిలియన్ లైక్స్ అందుకున్న పాటగా రికార్డులు తిరగరాసింది కళావతి. ఇంకా దూసుకుపోతూనే ఉంది ఈ సాంగ్. కచ్చితంగా రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు బద్దలు కావడం ఖాయంగా కనిపిస్తోంది. సర్కారు వారి పాట సినిమాలో మిగిలిన సాంగ్స్ కూడా అంతకంటే అద్భుతంగా వచ్చాయని ఊరిస్తున్నాడు తమన్.
ఇప్పటికే టైటిల్ సాంగ్ కూడా లీక్ అయింది. ఆచార్య పాట పాడిన హరిత నారాయణన్ ఈ పాట పాడింది. త్వరలోనే టైటిల్ సాంగ్ కూడా విడుదల చేయబోతున్నారు దర్శక నిర్మాతలు. మే 12న ప్రపంచ వ్యాప్తంగా సర్కారు వారి పాట విడుదల కానుంది. గీత గోవిందం లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత పరశురామ్ నుంచి వస్తున్న సినిమా ఇది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ప్రొడక్షన్స్ సంయుక్తంగా సర్కారు వారి పాట సినిమాను నిర్మిస్తున్నాయి.