Kalaavathi song | రిలీజ్‌కు ముందే రికార్డుల వేటలో మహేశ్ పాట
పరశురాం (Parasuram) దర్శకత్వంలో తెరకెక్కుతున్నసర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). నుంచి ఇప్పటికే విడుదలైన కళావతి పాట ఏ రేంజ్లో ఆకట్టుకుంటుందో నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోలను చూస్తే అర్థమవుతుంది.
టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). పరశురాం (Parasuram) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన కళావతి పాట ఏ రేంజ్లో ఆకట్టుకుంటుందో నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోలను చూస్తే అర్థమవుతుంది. కళావతి పాటకు హీరోహీరోయిన్లు, మ్యూజిక్ డైరెక్టర్లు,కొరియోగ్రాఫర్లు, మూవీ లవర్స్ ఇలా అందరూ అదిరిపోయే స్టెప్పులేస్తూ అదరహో అనిపిస్తున్నారు. ఈ సాంగ్‌కు హీరోయిన్ (Keerthy Suresh) కూడా సినిమాలోనే కాకుండా మరోసారి డ్యాన్స్ చేసింది.
ఈ పాట యూట్యూబ్‌లో రికార్డులు సృస్టిస్తోంది. యూట్యూబ్‌లో కళావతి పాట చాలా వేగంగా 70 మిలియన్లను క్రాస్ చేసింది. అంతేకాదు 1.5 మిలియన్ల లైక్స్ వచ్చాయి. దీంతోపాటు కళావతి పాట సోషల్‌మీడియాలో 1,50,000 రీల్స్ కు చేరుకుంది. మూవీ లవర్స్ ఈ పాటను ఎంతగా ఇష్టపడుతున్నారో చెప్పేందుకు ఈ స్ట్రాటజిక్ నంబరే ఉదాహరణగా చెప్పొచ్చు. థమన్ మ్యూజిక్ కంపోజిషన్, సిద్ శ్రీరామ్ వాయిస్, మహేశ్ బాబు స్టైలిష్ డ్యాన్స్ ఇలా అన్నీ కలగలిపి విజువల్ వండర్‌గా రికార్డులు సృష్టిస్తోంది కళావతి సాంగ్.
ఇండియాలో సెన్సేషన్ సృష్టించిన బ్యాంకు మోసాలు, ఆర్థిక నేరాల నేపథ్యంలో మహేశ్ మార్కు డైలాగ్స్‌తో సర్కారు వారి పాట సినిమా ఉండబోతుందని టాక్. గీత గోవిందం లాంటి సూపర్ హిట్ తర్వాత పరశురాం చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. విడుదలకు ముందే సర్కారు వారి పాట రికార్డుల వేట షురూ చేసిందంటే…రిలీజయ్యాక ఎలా ఉంటుందో చూడాలి.
Another Milestone🔥
Super 🌟 @urstrulyMahesh's #Kalaavathi 💝 marching ahead with 7️⃣0️⃣ million + views on YouTube
A @MusicThaman Musical#SarkaruVaariPaata
@KeerthyOfficial @ParasuramPetla @sidsriram @MythriOfficial @GMBents @14ReelsPlus pic.twitter.com/xd4Q654LKp— Saregama South (@saregamasouth) March 8, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

