Kakinada Shyamala | 80వ దశకంలో కాకినాడ శ్యామల గురించి తెలియని వారుండరు. నటిగా, నిర్మాతగా, ఫైనాన్షియర్‌గా తెలుగు, తమిళ చిత్రసీమల్లో ఎనలేని గుర్తింపు తెచ్చుకుంది. ‘మరో చరిత్ర’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కాకినాడ శ్యామల తెలుగు, తమిళ భాషల్లో కలిపి 200కు పైగా సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటుంది. చివరగా 2013లో ‘ఆకాశంలో సగం’ సినిమాలో కాకినాడ శ్యామల కనిపించింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా శ్యామల ఓ ఇంటర్వూలో సినిమా విశేషాలను, తన పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇక అదే ఇంటర్వూలో సిల్క్ స్మిత మరణంపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
సిల్క్ స్మిత గురించి మాట్లాడుతూ ‘నేను చాలా సినిమాలకు ఫైనాన్షియర్‌గా చేశాను. సిల్క్ స్మిత నిర్మాతగా రూపొందించిన సినిమాకు కూడా ఫైనాన్షియర్‌గా ఉన్నాను. అయితే సిల్క్ స్మిత నిర్మించిన సినిమా కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయింది. దాంతో సిల్క్ స్మిత అప్పులపాలైంది. ఆ ఒక్క సినిమాతోనే సిల్క్ స్మిత మొత్తం పోగొట్టుకుంది. అయినప్పటికీ సిల్క్ స్మిత అందరికీ అప్పులు తిరిగి చెల్లించింది. సిల్క్ స్మిత నిజాయితీ ఉన్న మనిషి. ఆమె వ్యక్తిత్వం చాలా గొప్పది. తెరపై వేసే పాత్రలు వేరు.. నిజజీవితంలో సిల్క్ స్మిత వేరు. అయితే సిల్క్ స్మితను హత్య చేశారని కొందరి, ఆత్మ హత్య చేసుకుందని మరికొందరు అంటుంటారు. నిజానికి ఏం జరిగిందనేది పైనున్న భగవంతుడికే తెలియాలి. కానీ ఆమె మరణం వెనుకున్న మిస్టరీ ఏంటో ఇప్పటికీ తెలియదు’ అంటూ చెప్పుకొచ్చింది.