ముంబై : కరోనా మహమ్మారి బాలీవుడ్‌ను వెంటాడుతున్నది. ఇప్పటికే ఎంతో మంది నటీ నటులు వైరస్ బారినపడ్డారు. తాజాగా కాజోల్ సైతం వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్ష చేశారు. రెండు మూడు రోజుల నుంచి కోవిడ్ లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్‌గా వచ్చిందని ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ‘నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎర్రబడిపోయిన నా ముక్కును ఎవరూ చూడొద్దనుకుంటున్నా. అందుకే చిరునవ్వుతోనే అల్లుకుపోదాం. మిస్ యూ నైసా దేవగన్..’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది కాజోల్.
తన కూతురిని మిస్ అవుతున్నానన్న కాజోల్.. ఆమె కుమార్తె చేతి నిండా మెహందీతో ముఖంపై బ్రైట్ స్మైల్‌తో ఉన్న ఫొటోను షేర్ చేసింది. ఈ సందర్భంగా అభిమానులు నెటిజన్లు ఆమె త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు. నటి ప్రియాంక చోప్రా సైతం కాజోల్ పోస్ట్‌పై స్పందించి.. ‘స్టన్నింగ్’ అంటూ కాజోల్ (Bollywood) కుమార్తెను ఉద్దేశించి కామెంట్ పెట్టారు. ఇదిలా ఉండగా.. ఇటీవల ‘త్రిభంగ’ సినిమాతో కాజోల్ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. రేణుక షహనే డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి వీక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం కాజోల్ రేవతి దర్శకత్వంలో ‘ది లాస్ట్ హుర్రే’ అనే చిత్రంలో నటిస్తున్నది.