తనతో కాకుండా సిరి వేరే గ్యాంగ్‌తో మాట్లాడడాన్ని జీర్ణించుకోలేకపోయిన షణ్ముఖ్ ఆమెని అనరాని మాటలు అన్నాడు. నువ్ ఎడ్డిదానిలాగే ఉంటున్నావ్.. నీకు బయట బ్యాడ్ నేమ్ వస్తుంది. క్యారెక్టర్ బ్యాడ్‌గా వెళుతుంది. ఇది ఇద్దరితోనూ ట్రాక్ నడుపుతుందనే పేరు వస్తుంది. మానస్, కాజల్.. ఈ ట్రాక్ విషయంలో కావాలని పుష్ చేస్తున్నారు.. నువ్ ఇలాంటివి చేస్తే నా పక్కన ఉండొద్దు. పింకీ అయిపోయింది ఇప్పుడు నువ్వా? నీ రెస్పాన్స్.. నీ ఇన్ టెన్షన్ ఏంటో నాకు తెలుసు.. నువ్ నాకు చెప్పకు.. బయటకు వెళ్తే నువ్ ఎవరో నువ్ ఎవరో’ అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయాడు షణ్ముఖ
అయితే మానస్, సన్నీ, కాజల్ ముగ్గురూ కిచెన్ దగ్గర కూర్చుని ఉండగా.. సిరి కుంటుకుంటూ అలా వెళ్తుంటుంది.. సన్నీ జాంబీ అని పిలుస్తాడు.. ఆమె ఇటు తిరిగే సరికి ఎంత క్యూట్‌గా తిరిగిందో అని సన్నీ అనగా.. ఇప్పుడు నీకు క్యూట్‌గానే ఉంటుందిలే అని అంటాడు మానస్. ఇంతలో సిరి సన్నీ దగ్గరకు వస్తుండగా.. వీళ్లు నిన్న నా అలియాభట్ అని అంటున్నారు అని అనగా.. ‘అన్నయ్యా అన్నావంటే ఎదురవనా’ అంటూ పాట పడుతుంది సిరి.
అన్నయ్యా అంటే ఫీల్ అయ్యావా?? హేట్ తరువాత నీకు వచ్చేది లవ్వే అని కాజల్ సన్నీని రెచ్చగొడుతుంది. నన్ను అన్నయ్య అన్నప్పుడు షణ్ముఖ్ ఇక్కడ ఉండి ఉంటే.. 1000 వాట్స్ బల్బ్‌లా అతని ముఖం వెలిగిపోయేదని చెప్తాడు సన్నీ. ఆ మాటతో తెగ నవ్వుకుంటుంది కాజల్.