Actress Kajal Aggarwal | పదిహేనేళ్ల క్రితం పదహారేళ్ల వయసు పైబడిన ఏ అబ్బాయిని కదిలించిన కాజల్ అగర్వాల్ నామమే జపం చేశారు. అంతలా తన సినిమాలతో యూత్‌లో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకుంది ఈ ముంబై బ్యూటీ. చందమామా, మగధీర, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్ ఇలా బ్యాక్ టు బ్యాక్ బంపర్ హిట్లతో టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. ఇప్పటికి సౌత్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటీమణులలో కాజల్ ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అరడజనుకు పైగానే సినిమాలున్నాయి. అందులో బాలకృష్ణ నటిస్తున్న భగవంత్ కేసరి ఒకటి.
అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కాగా సోమవారం కాజల్ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ ఈ సినిమాలోని కాజల్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో కాజల్ ఓ చేతిలో బుక్ పట్టుకుని మరో చేతిలో ఫోన్ పట్టుకుని కాల్ మాట్లాడుతుంది. కళ్లజోడు ధరించి క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో కాజల్, బాలయ్యకు జోడీగా నటిస్తుంది. ఇక ఇటీవలే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్ ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేసింది. శ్రీలీల కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా విడుదల కానుంది.
ప్రస్తుతం కాజల్ దలపతి విజయ్ సరసన ఓ సినిమా చేస్తుంది. దీంతో పాటుగా ఇండియన్-2లోనూ కమల్‌తో ఆడి పాడనుంది. వీటితో పాటుగా ఉమా, పారిస్ పారిస్ అనే రెండు తమిళ సినిమాలో కూడా చేస్తుంది. తెలుగులో సత్యభామ అనే లేడి ఓరియెంటెడ్ సినిమా చేస్తుంది. తాజాగా విడుదలైన గ్లింప్స్‌కు విశేష ఆధరణ వస్తుంది. సినిమాలే కాకుండా కాజల్ వెబ్ సిరీస్‌లను కూడా చేస్తుంది. లైవ్ టెలికాస్ట్ అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రియులను కూడా ఆకట్టుకుంది.
Team #BhagavanthKesari wishes the ever-charming @MsKajalAggarwal a very Happy Birthday ❤️
May your magnetic presence captivate the audience on the big screens 💥#HappyBirthdayKajal 💫#NandamuriBalakrishna @AnilRavipudi @sreeleela14 @rampalarjun @MusicThaman @jungleemusicSTH pic.twitter.com/H0wOwmLpeZ
— Shine Screens (@Shine_Screens) June 19, 2023