ప్రస్తుతం టాలీవుడ్లో కుర్ర భామల హవా నడుస్తున్న విషయం తెలిసిందే..పూజా హెగ్డే, రష్మిక మందన్నా, కియారా అద్వానీ లాంటి కొందరు కుర్ర హీరోయిన్స్ వరుస ఆఫర్స్ అందిపుచ్చుకుంటున్నారు. అయితే వీరితో పోటీ పడి ఛాన్స్ లు దక్కించుకుంటుంది కాజల్. ‘హే సినామిక, కరుంగాపియమ్,ఘోస్టీ’ సినిమాల షూటింగ్స్‌ను పూర్తి చేసిన కాజల్. ఇటీవల ఆమె నటిస్తున్న హిందీ చిత్రం ‘ఉమ’ కోల్‌కతా షెడ్యూల్ పూర్తి చేసింది.
తెలుగులో చిరంజీవి ‘ఆచార్య’, నాగార్జున హీరోగా నటిస్తున్న చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొంటుంది కాజల్. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీతో సరదాగా గడుపుతూ ఉంటుంది. వెకేషన్‌కి వెళ్లినప్పుడు తన భర్తతో దిగిన ఫొటోలతో పాటు తన ఫొటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని ఎంతగానో అలరిస్తుంటుంది. తాజాగా కాజల్ బికినీ ఫొటోలు షేర్ చేసి అందరికి షాకిచ్చింది.
తన ఇన్‌స్టాగ్రాములో స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని పూల్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు షేర్ చేసింది. ఇందులో కాజల్ చాలా హాట్‌గా కనిపిస్తుంది. పెళ్లి తర్వాత కాజల్ ఈ రేంజ్లో కనిపించడం ఇదే తొలిసారి కాగా, గ్లామర్ ఫీల్డ్‌లో పోటీ తట్టుకోవాలి అంటే ఈ మాత్రం అందాలు ఆరబోయాల్సిందేనంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.