Kajal Aggarwal | కథానాయిక కాజల్ అగర్వాల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. గత కొన్నేళ్లుగా ఆశించిన విజయాలు దక్కకపోయినా ఈ భామ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. దక్షిణాదితో పాటు హిందీలో కూడా భారీ చిత్రాల్లో అవకాశాలను దక్కించుకుంటున్నది. తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్లో బంపరాఫర్‌ను సొంతం చేసుకుంది. ‘సికందర్’ చిత్రంలో సల్మాన్‌ఖాన్ సరసన నటించనుంది. ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో పాన్ ఇండియా యాక్షన్ చిత్రంగా ‘సికిందర్’ను తెరకెక్కిస్తున్నారు. సాజిద్ నడియావాలా నిర్మాత. ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా, మరో కీలక పాత్రలో కాజల్ అగర్వాల్‌ను ఎంపిక చేశారు.
సల్మాన్‌ఖాన్‌తో ఆమెకిది తొలిచిత్రం కావడం విశేషం. కథాగమనంలో కాజల్ అగర్వాల్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని, త్వరలో ఆమె షూటింగ్లో జాయిన్ అవుతుందని మేకర్స్ తెలిపారు. సుదీర్ఘ విరామం తర్వాత బాలీవుడ్లో అగ్ర హీరో చిత్రంలో ఛాన్స్ దక్కించుకుంది కాజల్ అగర్వాల్. ఈ సినిమా బాలీవుడ్ కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని కాజల్ అగర్వాల్ ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తెలుగులో ‘కన్నప్ప’ చిత్రంలో నటిస్తున్నది.