అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ తెలుగులో తొలిసారి వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నట్లు తెలిసింది. ‘విశాఖ’ పేరుతో తెరకెక్కిస్తున్న ఈ సిరీస్‌కు సుధీర్‌వర్మ దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. హిందీలో సుస్మితాసేన్ నటించిన ‘ఆర్య’ వెబ్‌సిరీస్‌కు రీమేక్ ఇదని అంటున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ మాఫియా డాన్ పాత్రను పోషిస్తున్నట్లు తెలిసింది.
నగరంలో ఓ మాఫియా డాన్ ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురవుతాడు. వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆయన భార్య మాఫియా డాన్‌గా అవతారమెత్తుతుంది. ఈ నేపథ్యంలో చోటుచేసుకునే సంఘటనల నేపథ్యంలో సాగే కథాంశమిది.
తెలుగులో కాజల్ అగర్వాల్ నటిస్తున్న తొలి వెబ్‌సిరీస్ ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఏడాది ‘కన్నప్ప’ చిత్రంలో అతిథి పాత్రలో మెరిసింది కాజల్ అగర్వాల్. ప్రస్తుతం ఈ భామ హిందీలో ‘రామాయణ’ సిరీస్ చిత్రాలతో పాటు ‘ది ఇండియన్ స్టోరీ’ అనే చిత్రంలో నటిస్తున్నది.