నటి కాజల్ అగర్వాల్ మెగా ఫోన్ పట్టనున్నారు. కెరీర్ పీక్స్ ఉన్నప్పుడే తన చిరకాల మిత్రుడు గౌతమ్ కిచ్లుని పెళ్లాడేసి, వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన ఈ అందాల చందమామ.. ‘భగవంత్ కేసరి’తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలపెట్టారు. ఆ సినిమా ఘన విజయం సాధించినా ఆ క్రెడిట్ అంతా బాలకృష్ణ, అనిల్ రావిపూడిల ఖాతాలో పడిపోవడంతో కాజల్‌కి మాత్రం ఆ స్థాయి అవకాశం మళ్లీ రాలేదు.
ఈ నెలలోనే ఆమె పార్వతీదేవి పాత్రలో నటించిన ‘కన్నప్ప’ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే రెండు దశాబ్దాల తన అనుభవాన్నంతా క్రోడీకరించి, ఓ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించేందుకు కాజల్ సిద్ధమయ్యారని బీటౌన్ టాక్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికార ప్రకటన విడుదల కానుంది.