లాయర్ పాత్రలో
కాజల్ అగర్వాల్ లాయర్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ది ఇండియా స్టోరీ’. చేతన్ డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సాగర్ బి షిండే నిర్మిస్తున్నారు. జూలై 24న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకురానుంది.
కాజల్ అగర్వాల్ లాయర్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ది ఇండియా స్టోరీ’. చేతన్ డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సాగర్ బి షిండే నిర్మిస్తున్నారు. జూలై 24న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకురానుంది. పంటసాగులో పురుగు మందుల వినియోగం, పెస్టిసైడ్స్ కంపెనీల కుంభకోణాల నేపథ్యంలో రైతు సమస్యల్ని, సమకాలీన అంశాల్ని చర్చిస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో వ్యవస్థలోని అవినీతిపై పోరాడే న్యాయవాదిగా కాజల్ అగర్వాల్ కనిపించనుంది.
రసాయనాల దుర్వినియోగం కేవలం పర్యావరణ సమస్య కాదని, అది మానవ సంక్షోభానికి దారితీస్తుందని, ఈ సినిమా ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించబోతున్నామని నిర్మాత సాగర్ బి షిండే తెలిపారు. నిజాయితీగా చేసిన ప్రయత్నమిదని, సందేశంతో పాటు వినోదాత్మక అంశాలుంటాయని దర్శకుడు చేతన్ డీకే చెప్పారు. ఈ చిత్రంలో కథానాయకుడిగా శ్రేయస్ తల్పడే నటిస్తున్నారు. జీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

