‘ ‘సత్యభామ’ నా కెరీర్లో కొత్త ప్రయత్నం. ఇలాంటి పాత్ర చేయడం ఇదే ప్రథమం. ఈ కథలో కొత్త ఎమోషన్స్ ఉన్నాయి. ఫస్ట్‌టైమ్ నా కెరీర్లో భారీ యాక్షన్ సీన్స్ చేశాను. చాలా కష్టపడి స్టంట్స్ చేశాను. ఇందులోని నా పాత్ర పర్సనల్ లైఫ్, ప్రొఫెనల్ లైఫ్ రెండూ బ్యాలెన్స్ చేస్తుంటుంది. రియల్‌లైఫ్‌లో నేను చేస్తున్నది కూడా అదే. ఈ సినిమా మేకింగ్ టైమ్‌లో ఓ పెద్ద పోలీస్ ఆఫీసర్ని కలిశాను. ఆయన క్రిమినల్ యాక్టివిటీస్ గురించి వివరంగా చెప్పారు. ఆయన చెప్పిన అంశాలనే ఈ కథలో భాగం చేశాం. పూర్తిస్థాయి యాక్షన్ సినిమా చేయాలనే నా కోరిక ‘సత్యభామ’తో తీరింది.’
అని కాజల్ అగర్వాల్ అన్నారు. ఆమె ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘సత్యభామ’. సుమన్ చిక్కాల దర్శకుడు. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మాతలు. జూన్ 7న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాజల్ మాట్లాడింది. యాక్షన్, ఎమోషన్స్ కలగలసిన కథాంశంతో తెరకెక్కిన సినిమా ఇదని, ఓ కేసును పర్సనల్‌గా తీసుకొని ఇన్విస్టిగేషన్ చేస్తున్న ఓ పోలీస్ ఆఫీసర్, ఆ కేసు విషయంలో ఎమోషనల్ అవుతుంది. చివరకు ఆ కేసును జస్టిస్ చేయగలిగిందా లేదా? అనేది ఈ సినిమా కథ అని, కాజల్‌లోని కొత్త కోణాన్ని ఇందులో చూస్తారని దర్శకుడు చెప్పారు. ఇంకా నిర్మాతలు కూడా మాట్లాడారు.