Kajal Aggarwal | టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా
సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కి ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని, తీవ్ర గాయాలపాలయ్యారని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఆమె పరిస్థితి విషమంగా ఉందంటూ తప్పుడు వార్తలు రాయగా, మరికొన్ని వేదికలు కాజల్ ఇక లేరంటూ షాకింగ్ రూమర్స్ సృష్టించాయి. దీంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఈ నేపథ్యంలో కాజల్ అగర్వాల్ స్వయంగా స్పందించారు. తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, ప్రస్తుతం పూర్తిగా సురక్షితంగా ఉన్నానని స్పష్టం చేశారు. నాకు యాక్సిడెంట్ జరిగిందని, ఇక లేనని కొన్ని నిరాధారమైన వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇవి నాకు చాలా ఫన్నీగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే అవి పూర్తిగా అబద్ధం. దేవుని దయవల్ల నేను పూర్తిగా క్షేమంగా ఉన్నాను. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దు, ప్రచారం చేయవద్దు. నిజాలపై, పాజిటివ్ విషయాలపై దృష్టి పెడదాం అని కాజల్ ఎక్స్, ఇన్స్టాగ్రామ్ స్టోరీల ద్వారా పేర్కొన్నారు.
నటి ఇచ్చిన క్లారిటీతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇకపై తప్పుడు ప్రచారాలను నమ్మకూడదని, బాధ్యతతో సోషల్ మీడియాలో వ్యవహరించాలని కోరుతున్నారు. ఇక కాజల్ ఇప్పుడు తన ఫ్యామిలీ బాధ్యతలు చూసుకుంటూ బిజినెస్‌లపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో సినిమాలు కాస్త తగ్గించింది. అప్పట్లో స్టార్ హీరోలు, కుర్ర హీరోల సరసన నటించి మెప్పించిన కాజల్ ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తూ అలరిస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా తెగ సందడి చేస్తూ రచ్చ రచ్చ చేస్తుంది. ఆమె పోస్ట్ చేసే ఫొటోలకి మాత్రం సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది.