HomeCinemaKajal Aggarwal Responding On Pahalgam Attack
Kajal Aggarwal | ఇది హిందూ ముస్లిం గొడవ కాదు.. పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించిన కాజల్ అగర్వాల్
Kajal Aggarwal - Pahalgam Attack | జమ్ము కశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాం (Pahalgam Attack) ప్రాంతంలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ నరమేధంలో 26 మరణించారు.
Kajal Aggarwal – Pahalgam Attack | జమ్ము కశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాం (Pahalgam Attack) ప్రాంతంలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ నరమేధంలో 26 మరణించారు. ఇక ఉగ్రదాడి అనంతరం దేశంలో పరిస్థితులు ఉత్కంఠగా మారిన విషయం తెలిసిందే. అయితే ఘటన అనంతరం పలు ప్రాంతల్లో మత ఘర్షణలు చెలరేగడంతో పాటు సోషల్ మీడియాలో హిందు వర్సెస్ ముస్లింలుగా విడిపోయి.. గొడవలు పెట్టుకుంటున్నారు. తాజాగా ఈ వివాదంపై స్పందించింది నటి కాజల్ అగర్వాల్.
పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి హిందూ వర్సెస్ ముస్లిం గొడవ కాదని, విద్వేషాలు రెచ్చగొట్టేవారు కోరుకునేది కూడా అదేనని నటి కాజల్ అగర్వాల్ అన్నారు. ఇది ఉగ్రవాదం వర్సెస్ మానవత్వం అని ఆమె స్పష్టం చేశారు. భారతీయులను ఒక ప్రత్యేకమైన వర్గం పేరుతో వేరు చేయవద్దని ఆమె తన సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. వేర్పాటు భావం భయాన్ని పెంచుతుందని, మరింత వ్యతిరేక భావాలకు దారితీస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. “మనమంతా ఒకే చైతన్యం, ఒకే జాతి” అని కాజల్ అగర్వాల్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.