Kajal Aggarwal | తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). ఈ భామ సెకండ్ ఇన్నింగ్స్ లోనూ సినిమాల విషయంలో ఏ మాత్రం తగ్గేదేలే అంటోంది. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది కాజల్. ఈ ఏడాది ఘోస్టీ (Ghosty) సినిమాతో ప్రేక్షకుల ముందుకుగా రాగా.. అంతగా ఆకట్టుకోలేకపోయింది.
కాగా ఇప్పుడు కాజల్ కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ అందించింది మేకర్స్ టీం. Kajal60 టైటిల్ గ్లింప్స్ వీడియోను ఇవాళ సాయంత్రం 6:39 గంటలకు బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ ప్లెక్స్‌లో లాంఛ్ చేయబోతున్నారు. కాజల్ ఈ సారి ఫీ మేల్ ఓరియెంటెడ్ సబ్జెక్టుతో వస్తున్నట్టు అర్థమవుతోంది. కాజల్ అగర్వాల్ మరోవైపు శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఇండియన్ 2లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. దీంతోపాటు హిందీలో ఉమ ప్రాజెక్టులో నటిస్తోంది.
తమిళంలో రెండు సినిమాలకు కూడా సైన్ చేసింది కాజల్. నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో ఎన్బీకే 108 (NBK 108)గా వస్తున్న భగవంత్ కేసరి చిత్రంలోనూ నటిస్తోంది. డైరెక్టర్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
Kajal 60 అప్డేట్
Get ready to witness mesmerizing @MSKajalAggarwal in an all new avatar ❤🔥#Kajal60 Title and Glimpse out today at 6.39 PM 💥
Join the team for the GRAND LAUNCH EVENT at RK Cineplex from 7 PM onwards!
ALL ARE INVITED 💫@AurumArtsoffl @MediaYouwe pic.twitter.com/47hNKqTw1x
— Vamsi Kaka (@vamsikaka) June 18, 2023