ఒకప్పుడు హీరోయిన్లకు పెళ్లి అయితే కెరీర్‌కి శుభం కార్డు పడేది. కానీ ఇప్పుడు అలా కాదు.. పెళ్లి అయినా సరే కెరీర్లో దూసుకెళ్తున్నారు. తెలుగులో సమంత అక్కినేని, బాలీవుడ్లో కరీనా కపూర్, రాధిక ఆప్టే ఇలా చాలామంది నాయికలు పెళ్లి తర్వాత కూడా మంచి అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో కాజల్ అగర్వాల్ కూడా చేరిపోయింది. గతేడాది అక్టోబర్ 30న గౌతమ్‌తో ఏడడుగులు నడిచిన కాజల్.. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూనే ఉంది. ఇంకా చెప్పాలంటే గతంలో కంటే ఎక్కువ పారితోషికమే తీసుకుంటుంది.
ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తెలుగులో నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న సినిమాలో స్పై కమ్ సెక్స్ వర్కర్ పాత్రలో నటిస్తోంది కాజల్. చిరంజీవితో ఆచార్య సినిమా కూడా చేస్తుంది. మరోవైపు తమిళనాట కమల్ హాసన్‌తో భారతీయుడు సీక్వెల్‌తో పాటు మరో రెండు సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. తాజాగా హిందీలో ఉమా అనే సినిమాకు కూడా కమిట్మెంట్ ఇచ్చింది కాజల్. కొత్త దర్శకుడు తతగత సింఘా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మిరాజ్ గ్రూప్ బ్యానర్‌పై అవికేష్ ఘోష్, మంతరాజ్ పాలివాల్ నిర్మిస్తున్నారు. ఒక పెళ్లి ఇంట్లో చోటు చేసుకున్న సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా కోసం కాజల్ ఏకంగా రూ.2.3 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటివరకు కాజల్ కెరీర్లో ఇదే హైయెస్ట్ రెమ్యునరేషన్. పెళ్లి తర్వాత ఇంత పారితోషికం అందుకోవడం చిన్న విషయం కాదు. ఏదేమైనా ఆఫ్టర్ మ్యారేజ్ కూడా కెరీర్‌ను పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తుంది కాజల్ అగర్వాల్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
ఆర్ఆర్ఆర్ పోస్టర్‌పై సైబరాబాద్ పోలీసుల సెటైర్
కత్రినాకైఫ్ రాఖీ కడతానంటే వద్దన్నారట..స్టోరీ చదవాల్సిందే
నటుడు ఆర్ నారాయణమూర్తి అరెస్ట్..!
లిప్ కిస్ టాక్ తో తాప్సీ పబ్లిసిటీ