Kajal Aggarwal | రెండేండ్లు వెండితెరకు దూరమైనా మళ్లీ తన క్రేజ్‌ను చూపించే ప్రయత్నం చేస్తున్నది అందాల తార కాజల్ అగర్వాల్. తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో మంచి అవకాశాలు దక్కించుకుంటున్నదీ నాయిక. కమల్‌హాసన్ సరసన ‘ఇండియన్ 2’లో నటిస్తూనే తమిళంలో అజిత్ కొత్త సినిమాలో నాయికగా ఎంపికైంది. ఇప్పుడు తెలుగులో బాలకృష్ణ 108వ సినిమాలోనూ ఒక హీరోయిన్గా కాజల్ కనిపించబోతున్నది. ఈ చిత్రంలో కాజల్‌తో పాటు శ్రీలీల నాయికగా నటిస్తున్నది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ సినిమాలో కాజల్ క్యారెక్టర్ కీలకంగా ఉండనుందట.
ఈ సినిమా సెట్లో కాజల్ మార్చి తొలివారంలో అడుగుపెట్టనుందని సమాచారం. ఆమెకు సంబంధించిన సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరిస్తారని తెలుస్తున్నది. ఈ విషయంపై చిత్రబృందం ప్రకటన చేయాల్సి ఉంది. ఎ మోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతున్నది. కాజల్ తమిళంలో ‘కరుంగాపియమ్’, ‘గోస్టీ’, బాలీవుడ్లో ‘ఉమా ’ అనే సినిమాల్లో నటిస్తున్నది.