తెలుగులో ఒకప్పుడు అగ్ర కథానాయికగా ఓ వెలుగువెలిగిన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సినిమాల ఎంపికలో సెలెక్టివ్‌గా ఉంటున్నది. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఈ పంజాబీ సోయగం తెలుగు సినిమాల్లో బిజీ అవుతున్నది. తాజాగా ఆమె నటిస్తున్న తొలి తెలుగు వెబ్‌సిరీస్ ‘విశాఖ’ షూటింగ్‌ను పూర్తిచేసుకుంది. సుధీర్‌వర్మ దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సిరీస్‌లో కాజల్ అగర్వాల్ పవర్ఫుల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనుందట.
లేడీడాన్‌గా మరోవైపు సాధారణ గృహిణిగా ఆమె పాత్ర భిన్న పార్శాల్లో సాగుతుందని, యాక్షన్ ఘట్టాల్లో కాజల్ పర్ఫార్మెన్స్ హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. సుస్మితాసేన్ హిందీ ‘ఆర్య’ వెబ్‌సిరీస్‌కు రీమేక్‌గా ‘విశాఖ’ను రూపొందిస్తున్నారు. త్వరలో ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమవుతున్నది. ఇదిలావుండగా బాలకష్ణ 111వ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటున్నది.