Kaikala: నాన్నగారు కోలుకుంటున్నారు.. తప్పుడు వార్తలు నమ్మోద్దంటున్న కైకాల కూతురు

ఎన్నో సినిమాల్లో క్యారెక్ట్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా, విలన్ గా నటించి జనాల్ని అలరించారు కైకాల సత్యనారాయణ. గత కొద్ది కాలంగా వయోభారంతో సినిమాలకి దూరమయ్యారు. ఇటీవల కైకాలకి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అపోలో హాస్పిటల్ లో చేర్పించారు. అప్పట్నుంచి ఆయన్ను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.
కొద్దిరోజుల క్రితం తన ఇంట్లో జారిపడ్డ కైకాల నొప్పులు కాస్త ఎక్కువగా ఉండడంతో సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో వైద్యం పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో.. జూబ్లీ హిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన మరణించినట్టు తప్పుడు ప్రచారం జరగగా, కైకాల కూతురు ఖండించింది.
అందరికి నమస్కారం. నేను కైకాల సత్యనారాయణ గారమ్మాయి రమాదేవిని. నాన్న గారు ప్రస్తుతం హాస్పిటల్లోనే ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుంది. డాక్టర్స్ అందించే చికిత్సకి స్పందిస్తున్నారు. అందరితో మాట్లాడుతున్నారు కూడా. దయచేసి ఆయన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందక్కర్లేదు. అలాగే దయచేసి ఆయన ఆరోగ్యంపై అనవసర వార్తలను రాయడం, ప్రసారం చేయడం లాంటివి చేయకండి. ఆయన ఆరోగ్యంపై అనవసర వార్తలను ప్రసారం చేసి జనాల్ని ఆందోళన పరచవద్దు” అని తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

