వర్ధన్, కృష్ణప్రియ జంటగా నటిస్తున్న ప్రేమకథాచిత్రం ‘కాగితం పడవలు’. ఎంజీఆర్ తుకారం దర్శకుడు. కీర్తన నరేశ్, టీఆర్ ప్రసాద్‌రెడ్డి వెంకట్రాజుల, గాయిత్రమ్మ అంజనప్ప నిర్మాతలు. ఇప్పటికే ప్రచార చిత్రాలకు మంచి స్పందన వస్తున్నదని మేకర్స్ ఆనందం వెలిబుచ్చారు.
తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 24న ఏషియన్ సురేశ్ ఎంటర్టైన్మెంట్ ద్వారా సినిమా విడుదల కానున్నది. అందర్నీ అలరించే హృద్యమైన ప్రేమకథాచిత్రమిదని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: రుద్రసాయి, సంగీతం: ఏఐఎస్ నౌఫల్ రాజా, నిర్మాణం: ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణది క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్.