Kadambari Kiran | టాలీవుడ్ కామెడియన్, వెంకీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు రామచంద్ర గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అతడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని మంచు మనోజ్‌తో పాటు పలువురు నటులు అతడికి ఆర్థిక సహాయం అందించారు. తాజాగా నటుడు మనం సైతం నిర్వాహకులు కాదంబరి కిరణ్ (Kadambari Kiran) కూడా రామచంద్రకి ఆర్థిక సాయన్ని అందించాడు. వైద్య ఖర్చుల కోసం రూ.25 వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా అతడికి ధైర్యం, భరోసా కల్పించారు. ఈ విషయాన్ని కాదంబరి కిరణ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. వెంకీ సినిమాలో రవితేజ స్నేహితుడిగా నటించి ఆకట్టుకున్న రామచంద్ర.. ఆనందం, సొంతం, దుబాయి శీను, కింగ్, లౌక్యం వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు.