కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘కబ్జ’. ఈ చిత్రంలో శ్రియా సరన్, కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్, జగపతి బాబు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆర్ చంద్రు స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. 1847 నుంచి 84 మధ్యకాలంలో జరిగే కథ ఇది. ఓ స్వాతంత్య్ర సమరయోధుని కొడుకు నేర ప్రపంచంలో ఎలా చిక్కుకున్నాడు అనేది ఆసక్తకిరంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో గ్యాంగ్స్టర్ క్యారెక్టర్లో ఉపేంద్ర కనిపించనున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ఈ నెల 17న తెరపైకి వస్తున్నది.
ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్ సుధాకర్ రెడ్డి సమర్పణలో రుచిరా ఎంటర్టైన్మెంట్స్, ఎన్ సినిమాస్ సంస్థలు విడుదల చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ విడుదల చేశారు. ట్రైలర్ తనకు బాగా నచ్చిందని చెప్పిన అమితాబ్…మేకింగ్ ఆకట్టుకుందని ప్రశంసించారు. అన్ని భాషల్లో ట్రైలర్ను విడుదల చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం : రవి బస్రూర్.