‘1947-80 మధ్యకాలంలో ఓ డాన్ జీవితంలో ఏ జరిగిందో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటున్నారు ఉపేంద్ర. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కబ్జా’. ఆర్ చంద్రు దర్శకుడు. చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. సుదీప్ కీలక పాత్రధారి. ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా శనివారం మోషన్ పోస్టర్‌ను విడుదలచేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘అండర్‌వరల్డ్ కథాంశంతో యాక్షన్ ఎంటర్టైనర్గా సినిమాను తెరకెక్కిస్తున్నాం. టీజర్‌ను దీపావళికి విడుదలచేస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్.