Jailer Movie | సూపర్‌స్టార్ రజనీ కాంత్ ప్రస్తుతం ఓ మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ‘రోబో’ తర్వాత ఇప్పటివరకు రజనీకు సరైన హిట్టు లేదు. మధ్యలో ‘పేట’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న, కమర్షియల్‌గా భారీ విజయం సాధించలేక పోయింది. ప్రస్తుతం ఈయన నెల్సన్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ అనే యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరుతూనే ఉన్నాయి. ఫస్ట్‌లుక్ పోస్టర్ నుండి కాస్ట్ రివీల్ వరకు ప్రతీది ప్రేక్షకులలో ఉత్కంఠ రేపుతుంది. ఇటీవల రిలీజైన గ్లింప్స్ కు వీర లెవల్లో అంచనాలు పెరగాయి. పదేళ్లకు పైగా సరైన హిట్టులేని రజనీకు జైలర్ మంచి కంబ్యాక్ అవుతుందని అభిమానులు ధీమాగా ఉన్నారు. నెల్సన్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన కావాలా సాంగ్‌కు తిరుగులేని రెస్పాన్స్ వచ్చింది. మొదట్లో జానాలకు అంతగా ఎక్కలేదు కానీ.. ఇప్పుడు బాగానే ఆదరిస్తున్నారు. తాజాగా ఈ పాట తెలుగు వెర్షన్ అప్డేట్ను మేకర్స్ వెల్లడించారు. శుక్రవారం ఈ పాటను హైదరాబాద్‌లోని సీఎమ్ఆర్ కాలేజ్‌లో తమన్నా లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ, సునీల్, ప్రియాంక అరుళ్మోహన్ వంటి స్టార్ కాస్ట్ ఈ సినిమాలో నటిస్తుంది.
Hyderabad! @tamannaahspeaks is all set to launch #Kaavaali on July 26th 🥳 💃🏻
Telugu version of #Kaavaalaa is on the way!😎@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @suneeltollywood @sindhujas13 @AsianCinemas_ #Jailer pic.twitter.com/3yh9f5v7Sh
— Sun Pictures (@sunpictures) July 24, 2023