వినయ్‌కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కవితాత్మక ప్రేమకథ ‘కాలమేగా కరిగింది’. శింగర మోహన్ దర్శకుడు. మరే శివశంకర్ నిర్మాత. ఈ నెల 21న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా శనివారం ఈ సినిమా ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్‌ని గమనిస్తే.. ఫణి, బిందు అనే ఇద్దరు టీనేజర్ల ప్రేమకథ ఇదని తెలుస్తున్నది.
వారి పాత్రల్లో స్వచ్ఛమైన ప్రేమ, అమాయకత్వం గోచరిస్తున్నది. ప్రేమే లోకంగా కలహాలే లేని ప్రేమికులుగా ఉన్న వారిద్దరినీ కాలం విడదీసింది. దాంతో ఆ జ్ఞాపకాలను వెతుక్కుంటూ చివరకు వారిద్దరూ ఎలా కలిశారు? అనేదే ఈ కథ అని ట్రైలర్ చెబుతున్నది. ఈ చిత్రానికి కెమెరా: వినీత్ పబ్బతి, సంగీతం: గుడప్పన్, నిర్మాణం: సింగార క్రియేటివ్ వర్క్స్.