Kaala Paani | డిఫరెంట్ ఓరియెంటెడ్ కంటెంట్‌తో ఎల్లప్పుడూ ప్రేక్షకులకు అలరిస్తూ వస్తుంది ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్. అయితే నెట్‌ఫ్లిక్స్ తాజాగా ‘కాలా పాని’ (Kaala Paani) అంటూ ఇండియన్ వెబ్ సిరీస్‌తో ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అక్టోబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ కథలోకి వెళితే.. అండమాన్ – నికోబార్ ప్రాంతంలోని ఒక హాస్పిటల్లో విచిత్రమైన వ్యాధితో బాధపడుతూ 11 మంది పేషంట్స్ హాస్పిటల్లో చేరతారు. అయితే ఈ వ్యాధి మూలాలు ఎక్కడివి దానికి నియంత్రణ ఎలా అనే స్టోరీతో.. మరోవైపు అండమాన్ ప్రాంతంలోని నీరు ఎలా విషపూరితమైంది.. అది ఎలాంటి పరిస్థితులకు దారితీసింది? అనే కథాంశంతో ఈ సిరీస్ రూపొందింది.
ఈ సిరీస్ రావడం రావడమే మంచి మౌత్ టాక్‌తో వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఇది ఈ సిరీస్ మొదటి భాగమే. ఇక సీజన్ 2 ఎప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఓటీటీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే వారికి నెట్‌ఫ్లిక్స్ గుడ్ న్యూస్ తెలిపింది. ”కాలా పాని” సీజన్ 2 త్వరలోనే రానున్నట్లు మేకర్స్ తెలిపారు.
The dark waters are ready to take over once again! 🌊
Kaala Paani Season 2 Coming Soon, only on Netflix! #KaalaPaani #KaalaPaaniOnNetflix pic.twitter.com/OPXRnFU1YK— Netflix India (@NetflixIndia) November 13, 2023
బాలీవుడ్ నటి మోనా సింగ్ (Mona Singh), అశుతోష్ గోవారికర్ (AShutosh Govarikar), అమీ వాఘ్, సుకాంత్ గోయెల్, వికాస్ కుమార్, అరుషి శర్మ, రాధిక మెహ్రోత్రా, చిన్మయ్ మాండ్లేకర్, పూర్ణిమ ఇంద్రజిత్ తదితరులు ఈ సిరీస్‌లో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
పోషమ్ పా పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సిరీస్‌ను బిశ్వపతి సర్కార్, అమిత్ గోలాని, సందీప్ సాకేత్, నిమిషా మిశ్రా కలిసి సంయుక్తంగా నిర్మించారు సమీర్ సక్సేనా, అమిత్ గోలాని కలిసి దర్శకత్వం వహించారు.