Kaagitham Padavalu | ‘కాగితం పడవలు’ గ్లింప్స్ విడుదల.. గుండెను తాకే ప్రేమకథకు నాంది
Kaagitham Padavalu | దర్శకుడు ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న అందమైన ప్రేమకథా చిత్రం 'కాగితం పడవలు'.
Kaagitham Padavalu | దర్శకుడు ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న అందమైన ప్రేమకథా చిత్రం ‘కాగితం పడవలు’. ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్లపై కీర్తన నరేష్, టి.ఆర్. ప్రసాద్ రెడ్డి, వెంకట్రాజులు, గాయిత్రమ్మ అంజనప్ప ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ గ్లింప్స్‌ని చిత్రబృందం విడుదల చేసింది. చాలా దూరం వెళ్ళిపోయావు గోదావరి. నిన్ను ఎక్కడ వదిలేశానో అక్కడే నిలబడి ఉన్నాను రామ్ అని గ్లింప్స్‌లో వినిపించే డైలాగ్‌లు ఎమోషనల్‌గా ఆకట్టుకుంటున్నాయి. తీరంలో ఒక జంట కలుసుకోవడం, అందమైన విజువల్స్, నేపథ్య సంగీతం సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచాయి.
దర్శకుడు ఎంజీఆర్ తుకారాం ఈ చిత్రాన్ని అద్భుతమైన భావోద్వేగాలతో, హృదయాన్ని తాకే కథనంతో, అందమైన విజువల్స్‌తో తీర్చిదిద్దినట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ గ్లింప్స్ వీడియో వైరల్‌గా మారింది. భవిష్యత్తులో విడుదల కాబోయే ప్రచార కంటెంట్‌పై ఇది మంచి అంచనాలను పెంచింది. ఈ చిత్రానికి ఏఐఎస్ నౌఫల్ రాజా సంగీతాన్ని అందిస్తుండగా, రుద్రసాయి & జానా డీఓపీగా వ్యవహరిస్తున్నారు. ఎడిటింగ్ బాధ్యతలను జెస్విన్ ప్రభు చూసుకుంటున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎం. హిమ బిందు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఏఐఎస్ నౌఫల్ రాజా సంగీతం అందిస్తుండగా, రుద్రసాయి & జానా డీఓపీగా, జెస్విన్ ప్రభు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి కాస్ట్యూమ్స్ కిరణ్ సమకూర్చగా, ఎం. హిమ బిందు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. సాహిత్యం రెహమాన్ అందించగా, పీఆర్వో బాధ్యతలను తేజస్వి సజ్జా నిర్వహిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

