సురేష్‌బాబు, వశిష్టచౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘కే-3’(కీర్తి-కాంత-కనకం). ఆదిత్య వంశీ దర్శకుడు. రొక్కం భాస్కర్‌రెడ్డి నిర్మాత. ఇటీవల హైదరాబాద్‌లో ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. దర్శకుడు మాట్లాడుతూ ‘కాన్సెప్ట్ ప్రధానంగా తెరకెక్కుతున్న చిత్రమిది. కథను హీరోగా నమ్మి రూపొందిస్తున్నాం. మిస్సింగ్ కేసు అన్వేషణలో ఓ పోలీస్ తెలుసుకున్న నిజాలేమిటి? ఆ నేరంతో ఓ యువతికి ఉన్న సంబంధమేమిటన్నది ఆకట్టుకుంటుంది. సెన్సార్‌కు సిద్ధమైంది’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: చిన్నికృష్ణ.