K.T.R Birthday Wishes to Chiranjeevi | సోమవారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సోషల్‌మీడియాలో పలువరు సినీ సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు బర్త్‌డే విషెస్‌ను తెలియజేస్తున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేశాడు. ‘ప్రియమైన మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. శాంతి, ఆయురారోగ్యాలతో జీవితాంతం సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్విటర్లో విషెస్‌ను తెలియజేశాడు.
ఇక పవన్ కళ్యాణ్ ‘నేను ప్రేమించే, గౌరవించే.. ఆరాధించే నా ప్రియమైన సోదరుడికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. ఈ ప్రత్యేకమైన రోజున మీకు మంచి ఆరోగ్యం, విజయం, కీర్తి దక్కాలని కోరుకుంటున్నాను అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపాడు. పులువురు మెగాస్టార్ ఫ్యాన్స్ చిరు చిత్ర పటాలకు పాలతో అభిషేకాలు చేస్తూ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
Happy birthday Megastar dear @KChiruTweets Garu. Wishing you a long life with peace & good health
— KTR (@KTRTRS) August 22, 2022