Pawan Kalyan Son | తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఎన్నో మరుపురాని సినిమాలను అందించారు సీనియర్ డైరెక్టర్, దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు (Raghavendra Rao). దివంగత లెజెండరీ నటుడు సీనియర్ ఎన్టీఆర్ నుంచి యువ హీరో రోషన్ వరకు అన్ని తరాల యాక్షర్లతో సినిమా చేసిన క్రెడిట్ దక్కించుకునే అతికొద్ది మంది దర్శకుల్లో ఒకరు రాఘవేంద్రరావు. ఈ లెజెండరీ దర్శకుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుమారుడు (Pawan Kalyan Son) అకీరా నందన్‌తో కలిసి దిగిన స్టిల్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది.
ఫొటోలో వీరిద్దరితోపాటు ఉన్న మరో వ్యక్తి ఎవరో తెలుసా..? రాఘవేంద్రరావు మనవడు కార్తికేయ. ఇంతకీ ఈ ముగ్గురు ఎక్కడికెళ్లారనే కదా మీ డౌటు. ఈ ముగ్గురు నార్వేలో ఫొటో దిగారు. యూఎస్ఏలోని ఫిల్మ్ స్కూల్లో ఇద్దరినీ జాయిన్ చేసినట్టు చెప్పారు రాఘవేంద్రరావు. ఈ ఒక్క హింట్‌తో అకీరా నందన్ (Akira Nandan) ఇక రాబోయే రోజుల్లో పవన్ కల్యాణ్ నటవారసుడిగా సిల్వర్ స్క్రీన్‌పై మెరిసేందుకు కావాల్సిన శిక్షణ తీసుకుంటున్నాడని తెగ చర్చించుకుంటున్నారు పవర్ స్టార్ అభిమానులు.
త్వరలోనే అకీరా నందన్ హీరోగా సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ అప్పుడే చర్చించుకోవడం మొదలుపెట్టారు మూవీ లవర్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్. ఓ వైపు అకీరా నందన్, మరోవైపు కార్తికేయ.. ఇద్దరి మధ్యలో దర్శకేంద్రుడి స్టిల్ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
ఫిల్మ్ స్కూల్ వద్ద అకీరానందన్‌తో ఇలా..
Latest pics of smart looking #PawanKalyan son #AkiraNandan. pic.twitter.com/vDOePCAUGS
— Manobala Vijayabalan (@ManobalaV) August 21, 2023