K.G.F-2 First song | అప్పటివరకు కన్నడ సినిమాలంటే ఉపేంద్ర నటించనవి మాత్రమే అనే అనుకున్నాం. కొంత కాలానికి రాజమౌళి ఈగతో సుధీప్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేశాడు. ఇక అప్పటినుంచి ఈ ఇద్దరు ముఖాలను మాత్రమే సినిమాలలో చూసాం. అప్పటికి కన్నడ సినిమాలంటే అంతగా ఆసక్తి కనబరిచే వాళ్లం కాదు. అలాంటి సమయంలో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమా ‘కేజీఎఫ్’. ఇండియన్ సినీ చరిత్రలోనే అలాంటి ఎలివేషన్లు ఏ సినిమాలో చూడలేదు. ప్రశాంత్ నీల్ ఈ ఒక్క చిత్రంతో తానేంటో అని దేశ వ్యాప్తంగా చాటి చెప్పాడు. రాకింగ్ స్టార్ యష్ ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ స్టేటస్‌ను దక్కించుకున్నాడు. ఎప్పుడెప్పుడు పార్ట్-2 వస్తుందా అని సౌత్ నుంచి నార్త్ వరకు సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
ఇటీవలే మహిళా దినోత్సవం సందర్భంగా విడుదలైన పోస్టర్‌కు విశేష స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ‘తుఫాన్’ అంటూ సాగే లిరికల్ వీడియోసాంగ్‌ను మార్చి 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. గతంలో కేజీఎఫ్ చిత్రానికి పాటల వల్లనే విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇక పార్ట్-2 చిత్రానికి కూడా అదే విధంగా పాటలతో మంచి బజ్ క్రియేట్ చేయాలని చిత్ర బృందం ఆలోచిస్తుంది. హోంబలే సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలకపాత్రలో నటించనున్నాడు.
Stay Tuned!#Toofan is on your way 🔥🔥
‘Toofan’ Lyrical Video from
March 21st at 11:07 AM.#KGFChapter2 #KGF2onApr14@Thenameisyash @prashanth_neel @VKiragandur @hombalefilms @HombaleGroup @duttsanjay @TandonRaveena @SrinidhiShetty7 #KGF2 pic.twitter.com/iNrtR38nmi— DreamWarriorPictures (@DreamWarriorpic) March 18, 2022