Jyothi Labala | ఒకప్పుడు తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి జ్యోతి ఇప్పటి తరం ప్రేక్షకులకు కూడా పరిచయమే. కీలక పాత్రలతో సినిమాల్లో తనదైన ముద్ర వేసిన ఆమెకు అప్పట్లో ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ‘ఎవడిగోలవాడిది’, ‘గుడుంబా శంకర్’, ‘మహాత్మ’, ‘దరువు’, ‘రంగ ది దొంగ’, ‘కెవ్వు కేక’ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 1లో పాల్గొనడం ద్వారా టీవీ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఆ షోలో ఆమె వ్యక్తిత్వం, సింప్లిసిటీకి మంచి రెస్పాన్స్ లభించింది. బిగ్‌బాస్ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించిన జ్యోతి, క్రమంగా ఇండస్ట్రీకి దూరమయ్యింది.
చివరిసారిగా ఆమె 2020లో విడుదలైన ‘గోల గోల’ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత వెండితెరపై కనిపించకపోవడంతో ఆమె ఏమైపోయిందన్న చర్చలు కూడా జరిగాయి. ఇక తాజాగా జ్యోతి మరోసారి వార్తల్లో నిలిచింది. చాలా కాలం తర్వాత ఆమె బర్త్ డే సెలబ్రేషన్స్‌తో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఫ్రెండ్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా , ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వామ్మో ఈ వయస్సులో కూడా ఈ రేంజ్ బర్త్ డే సెలబ్రేషన్సా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలను చూసిన అభిమానులు, సెలబ్రిటీలు జ్యోతికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
జ్యోతి వ్యక్తిగత జీవితానికి వస్తే… ఆమె చిన్న వయసులోనే వివాహం చేసుకున్నారు. అయితే కొన్నేళ్లకే భర్తతో విభేదాలు రావడంతో విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి తన కొడుకును తానే పెంచుకుంటూ ఒంటరిగానే జీవిస్తోంది. ముఖ్యంగా తన కొడుకును ఎప్పుడూ మీడియాకు దూరంగా ఉంచింది. సోషల్ మీడియాలో కూడా అతడి ఫోటోలు షేర్ చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండేది. ఇటీవల తన ఇంటి గృహ ప్రవేశం సందర్భంగా తొలిసారిగా కొడుకుతో కలిసి ఫోటోలు పంచుకోవడంతో అతడిని చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు సినిమా హీరోలా ఉన్నాడంటూ చాలా కామెంట్స్ వచ్చాయి. కాగా, జ్యోతి తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుందా లేదా అన్నది చూడాలి.