అభిషేక్ పచ్చిపాల, నజియా ఖాన్, వినీషా జ్ఞానేశ్వర్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘జస్ట్ ఎ మినిట్’. యశ్వంత్ దర్శకుడు. తన్వీర్, ప్రకాశ్ నిర్మాతలు. ఈ నెల 19న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సినిమా ఫన్‌గా ఉంటుందని, డైరెక్టర్ అభిషేక్ సినిమాకోసం బాగా కష్టపడ్డాడని, ఈ సినిమా ఇంతబాగా రావడానికి నిర్మాతల సపోర్టే కారణమని, సాంకేతికంగా కూడా సినిమా రిచ్‌గా ఉంటుందని హీరో అభిషేక్ తెలిపారు.
దర్శకుడిగా అవకాశం ఇచ్చిన నిర్మాతలకు యశ్వంత్ కృతజ్ఞతలు తెలిపారు. సినిమాకోసం అందరూ కష్టపడి పనిచేశారని, ఈ నెల 19న విడుదల కానున్న ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందని నిర్మాతలు నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా కథానాయికలు నజీయాఖాన్, వినీషా జ్ఞానేశ్వర్‌తో పాటు చిత్ర యూనిట్ మొత్తం మాట్లాడారు.