Swathi Deekshith | టాలీవుడ్ నటి స్వాతి దీక్షిత్ (Swathi Deekshith) ఓ ఎన్ఆర్ఐ ఇంట్లోకి చొరబడ్డ ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. రూ.30 కోట్ల మార్కెట్ విలువ కలిగిన ఇంటి వ్యవహారంలో ఎన్నారైతో విభేదిస్తున్న స్వాతి దీక్షిత్.. కోర్టులో వ్యాజ్యం ఉన్నఆస్తిని లాక్కోవడానికి కుట్ర పన్నారని ఆరోపణల నేపథ్యంలో జూబ్లీ హిల్స్ పోలీసులు ఆమెతోపాటు పలువురిపై కేసు నమోదు చేశారు.
ఇటీవలే స్వాతి దీక్షిత్ సూచనల మేరకు సుమారు 20 మంది వ్యక్తులు సదరు ఎన్ఆర్ఐ ఇంటి ఆవరణలోకి చొరబడి.. బీభత్సం సృష్టించి కేర్‌టేకర్‌ను బెదిరించారని ఇంటి వాచ్మెన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు పోలీసులు స్వాతిదీక్షిత్తోపాటు ఇతర వ్యక్తులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సదరు హౌజ్ లీజ్ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం.