Jr NTR | టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ప్రస్తుతం కొరటాల శివ (Siva Koratala) డైరెక్షన్లో చేస్తున్న సినిమాతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఎన్టీఆర్ 30గా వస్తున్న దేవర Devara) ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదల చేయగా.. నెట్టింట హల్ చల్ చేస్తోంది. అయితే షూటింగ్‌తో తీరిక లేకుండా గడిపిన తారక్ బ్రేక్ తీసుకున్నాడు. విరామ సమయంలో దుబాయ్‌కు వెకేషన్ ట్రిప్ వేశాడు. తన భార్య, పిల్లలతో కలిసి సరదా సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. అయితే వెకేషన్లో కూడా డైలీ వర్కవుట్ సెషన్‌ను వదిలిపెట్టడం లేదు యంగ్ టైగర్.
పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న దేవర కోసం ఫిట్‌గా కనిపించేందుకు ఎక్కడున్నా ఫిట్నెస్ మంత్రను ఫాలో అవుతున్నాడు. దుబాయ్‌లో ఫిట్ నెస్ ట్రైనర్ కుమార్ మన్నవ తారక్‌తో దిగిన మిర్రర్ సెల్ఫీ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ఈ ఫొటోపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఫ్యాన్స్. ఫిషింగ్ హార్బర్ విలేజ్, పోర్ట్ మాఫియా బ్యాక్ డ్రాప్ చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కుతున్న దేవరలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోంది. తారక్ దేవరగా ఇదివరకెన్నడూ కనిపించని స్టన్నింగ్ యాక్షన్ అవతార్‌లో ఎంటర్టైన్ చేయబోతున్నాడు.
ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. మల్టీ లింగ్యువల్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రత్నవేల్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.ఎన్టీఆర్ 30ని 2024 ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. జనతాగ్యారేజ్ తర్వాత వస్తున్న రెండో సినిమా కావడంతో ఎన్టీఆర్ 30పై అంచనాలు భారీగానే ఉన్నాయి.